దేశ విద్యావ్యవస్థకు అద్దం పట్టే 'అసర్' నివేదిక ను ఈ పోస్ట్ తో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశం లోని వివిధ ప్రాంతాలతోపాటు 'అసర్' నివేదిక మన జిల్లా విద్యా వ్యవస్థపై కూడా సర్వే చేసింది. అంగన్ వాడి లలో చదువుతున్న పిల్లల సంఖ్యరాష్ట్రం మొత్తం మీద 81.5% కాగా మెదక్ జిల్లా లో 83.3% ఉంది. ఆరు నుండి పద్నాలుగేళ్ళ లోపు పిల్లల్లో బడి బయటిపిల్లల సంఖ్య రాష్ట్రం మొత్తం మీద 3.3% కాగా మెదక్ జిల్లాలో 3.2% ఉంది. వీరిని కూడా బడులలో చేర్చడానికి మనజిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ గారు వివిధ శాఖలను సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్నారు. వారి ఆశయానికిచేయూతనిచ్చి బడి బయటి పిల్లలను బడులలో చేర్చడానికి కృషి చేద్దాం.
మిగతా జిల్లాలతో పోలిస్తే విద్య ప్రైవేటీకరణ తక్కువగా ఉన్న జిల్లా మెదక్ కావడం మనకు సంతోషం కలిగించే అంశం. రాష్ట్రం మొత్తం మీద ప్రైవేటు బడులలో ఉన్న పిల్లల సంఖ్య 36.1% కాగా మెదక్ జిల్లాలో ఇది కేవలం 24.6% మాత్రమే. నాలుగు నుండి ఎనిమిదో తరగతి పిల్లల్లో ట్యూషన్ కి వెళ్ళే పిల్లల సంఖ్య రాష్ట్రం లో 18.3% కాగా మెదక్ జిల్లాలో కేవలం 8.9% ఉంది.
ఒకటి, రెండో తరగతుల్లో అక్షరాలను చదివే వారి సంఖ్య, అంకెలను గుర్తించేవారి సంఖ్య 86% ఉండడం సంతోషించదగ్గవిషయం. కానీ మూడు నుండి ఐదో తరగతి పిల్లలను ఒకటో తరగతి, అంతకు పై స్థాయి పుస్తకాలు చదివిస్తే కేవలం47.8% మంది పిల్లలు మాత్రమే చదవగలిగారు. మూడు నుండి ఐదో తరగతి పిల్లల్లో తీసివేతలు చేయగలిగే వారి సంఖ్యకేవలం 48% కావడం కూడా ఆందోళన కలిగించే అంశం. ఐదు నుండి ఎనిమిదో తరగతి పిల్లలను దైనందినకార్యకలాపాలకు సంబంధించిన ప్రశ్నలు ఒక్కో అంశంలో రెండు అడిగితే రెండింటికీ సరైన జవాబు చెప్పగలిగినవారుదాదాపు సగం మంది మాత్రమే. పరిస్థితి మెరుగుదలకు మనందరం కలిసి కృషి చేయాలి.
అందరి అవగాహన కోసం 'అసర్' పూర్తి నివేదికను కింద అటాచ్ చేస్తున్నాను. డౌన్ లోడ్ చేసుకునేందుకు లింక్:
http://www.ziddu.com/download/13925346/ASER_2010_Report.pdf.html
మీ....
అకడమిక్ మానిటరింగ్ అధికారి
రాజీవ్ విద్యా మిషన్, మెదక్ జిల్లా
No comments:
Post a Comment