రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్రసారమవుతున్న రేడియో పాఠాలు పిల్లల ఆదరణను చూరగొంటున్నాయి. ఈ పాఠాలను మరింత మెరుగ్గా పిల్లల భాగస్వామ్యంతో రూపొందిస్తోన్న పాఠాలే ఇంటరాక్టివ్ రేడియో ఇన్ స్ట్రక్షన్ (ఐ.ఆర్. ఐ.) పాఠాలు. ఈ పాఠాలు ఉపాధ్యాయులు, పిల్లల మన్ననలను మరింత చూరగొంటా యనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఐ.ఆర్.ఐ. కార్యక్రమాలపై ఈ నెల ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. మన జిల్లాలో సిద్ధిపేట, తూప్రాన్, ఆందోల్, సదాశివపేట ఎం.పి.డి.వో. కార్యాలయాల్లో టెలికాన్ఫరెన్స్ కు ఎం.ఆర్.పి. లు అందరూ హాజరు కావలసి ఉంటుంది. ఈ నెల ఇరవై ఏడో తేదీ నుండి జరిగే స్కూల్ కాం ప్లెక్స్ సమావేశాల్లో ఎం.ఆర్.పి.లు ఆర్.పి.లుగా వ్యవహరించాలి. ఈ నెల స్కూల్ కాం ప్లెక్స్ సమావేశాలు ఐ. ఆర్. ఐ. కార్యక్రమాలపై ఉంటాయి.
టెలికాన్ఫరెన్స్, స్కూల్ కాం ప్లెక్స్ సమావేశాలను మీరంతా జయప్రదం చేస్తారని ఆశిస్తూ...
మీ
ఆర్. సూర్య ప్రకాశ్ రావు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి, రాజీవ్ విద్యా మిషన్, మెదక్ జిల్లా
No comments:
Post a Comment