ఈ కింది సూచనలను గమనించ వలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
- ఈ మధ్య జరిగిన అసర్ సర్వేలో గమనించిన విషయమేంటంటే మన జిల్లాలోని స్కూళ్ళలో టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ వినియోగం చాలా తక్కువగా అంటే కేవలం మూడున్నర శాతం మాత్రమే ఉంది. రాజీవ్ విద్యా మిషన్ ద్వారాప్రతి ఏటా టి ఎల్ ఎం గ్రాంట్ ఇస్తున్నావినియోగం చాలా తక్కువ శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మనం మానిటరింగ్ ను పటిష్టం చేసి టి ఎల్ ఎం వినియోగం పెంచవలసిన అవసరం ఉంది.
- ఆర్ ఓటీ లను వెంటనే ఏదైనా ఒక స్కూల్ కాంప్లెక్స్ నుండి తెప్పించి ఎం ఆర్ సీ లో పెట్టుకోవాలి. తద్వారా టెలి కాన్ఫరెన్స్ లను మనం ఎమ్మార్సీలోనే చూడొచ్చు.
- స్నేహబాల శిక్షణ మూడు రోజులపాటు జరగనుంది. ఈ సారి అందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుంది. రాష్ట్ర స్థాయి లో శిక్షణ ఈ నెల 22నుండి మూడు రోజుల పాటు జరుగనుంది. మన జిల్లా నుండి అరవై మంది ఆర్పీ లు ఈ శిక్షణలో పాల్గొంటారు.
- ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు అందరు పిల్లలకు ఎల్ ఈ పీ బేస్ లైన్ ఈ నెలాఖరులో ఉంటుంది. ఎయిడెడ్ స్కూళ్ళతో సహా అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్ళలో ఈ టెస్ట్ నిర్వహించాలి. ఈ టెస్ట్ నే మొదటి యూనిట్ టెస్ట్ గా పరిగణించాలి. ప్రశ్నపత్రం రాష్ట్ర స్థాయిలోనే తయారు చేస్తారు. ఒక్కో స్కూలుకు ఒక్కో సెట్ ఇస్తారు. అవసరమయినన్నిసెట్స్ ను స్కూల్ గ్రాంట్ నుండి ఖర్చు పెట్టి కాపీస్ చేయించాలి.
- స్నేహబాల కార్డ్స్ ను స్కూళ్ళకు ఇచ్చేటప్పుడు ఒక జాగ్రత్త వహించాలి. గత సంవత్సరం డైస్ ప్రకారం ముప్పై లోపల పిల్లలు ఉండే స్కూలుకు ఒక సెట్టు, ముప్పై నుండి డెబ్బై అయిదు లోపల పిల్లలు ఉండే స్కూలుకు రెండు సెట్లు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే స్కూలుకు మూడు సెట్లు చూపున ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం స్నేహబాల సెట్స్ ను స్కూళ్ళకు అందజేయాలి.
మరికొన్ని సూచనలతో మళ్ళీ కలుద్దాం....
మీ
ఆర్.సూర్య ప్రకాశ రావు,
అకాడమిక్ మానిటరింగ్ అధికారి,
రాజీవ్ విద్యా మిషన్, మెదక్ జిల్లా
No comments:
Post a Comment