మిత్రులారా...
నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అయింది. ప్రతి సంవత్సరం లాగే బడిబాట కూడా ప్రారంభం అయింది.
బడి బాట లో భాగంగా మన జిల్లా లో రాష్ట్ర అదనపు సంచాలకులు శర్మ గారు పర్యటిస్తున్నారు. ఈ రోజు అడిషనల్ ఎస్పీడీ గారు జిన్నారం మండలం లోని బొల్లారం పారిశ్రామిక వాడలో పర్యటించారు. ఆ ప్రాంతంలో మొత్తం 103మంది పిల్లలు బడిబయట ఉన్నట్టు గుర్తించారు. ఆ పిల్లల తల్లి దండ్రులతో శర్మ గారు స్వయం గా మాట్లాడారు. వారిలో 39మంది ఒరిస్సా వారిగా గుర్తించారు. బొల్లారం లో ఇరవై మంది ని బడిలో చేర్పించారు.
మనజిల్లా కలెక్టర్ గారు బడిబాట కార్యక్రమం క్షేత్ర స్థాయిలో విజయవంతం కావాలని అభిలషిస్తున్నారు. సోమవారం జరిగిన సెట్ కాన్ఫరెన్స్ లో బడి బాటను విజయవంతం చేయడానికి కృషి చేయాలనిఅన్ని శాఖల అధికారులను ఆదేశించారు. బడిబాట కార్యక్రమం లో జిల్లా ప్రథమస్థానం లో నిలవాలని ఆయన కోరుకుంటున్నారు. మనం క్రింది కార్యాచరణ తో బడి బాట ను విజయవంతం చేద్దాం
* బడి బయటి పిల్లలను గుర్తించడం
*అయిదేళ్ళు నిండిన పిల్లల జాబితాను అంగన్ వాడి కార్యకర్త నుండి సేకరించడం
* ఐదో తరగతి, ఏడో తరగతి చదివిన పిల్లలను సమీపం లోని యూపీఎస్ లేదా హై స్కూళ్ళలో తరువాతి తరగతుల్లో చేర్చడం.
* ఇరవై ఒకటో తేదీన జరిగే సామూహిక అక్షరాభ్యాసానికి ఏర్పాట్లు చేయడం.
* ప్రతి నైవాసిక ప్రాంతంలో బడిబయట పిల్లలెవరూ ఉండకుండా చూడడం.
బడి బాట కార్యక్రమాన్ని మనమంతా కలిసి విజయవంతం చేద్దాం. జిల్లాలో బడిబయట పిల్లలెవరూ ఉండకుండా చూద్దాం.
బడి బాట కార్యక్రమాలపై మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మరిచిపోకండి.
ఉంటా మరి......
మీ
ఆర్. సూర్య ప్రకాశ్ రావు,
అకాడమిక్ మానిటరింగ్ అధికారి,
రాజీవ్ విద్యా మిషన్, మెదక్ జిల్లా
No comments:
Post a Comment