మిత్రులారా...
జిల్లా మరియు మండల స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.రేపటినుండి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది.
మీ అందరికి నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం విద్యార్థులు పురోభివృద్ధికి మీరు కృషి చేయాలనికోరుకుంటున్నాను.
విద్యా సంవత్సరం తో పాటే బడిబాట కూడా ప్రారంభం అవుతోంది.
బడి బాటలో ప్రధానం గా బడిబయట ఉన్న పిల్లలను బడులలో చేర్చాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. బడి ఈడుపిల్లలు ఉండాల్సింది బడుల్లోనే కానీ పనుల్లో కాదని చెప్పండి. అందరికీ విద్యాగంధాన్నిఅందించండి.
ఈ క్రింది కార్యాచరణ ప్రణాళిక తో పని చేయాలని కోరుతున్నాను.
* స్నేహబాల స్లిమ్ కార్డుల సహాయంతో బోధన
*Early Reading, Early Maths ప్రోగ్రామ్స్.
పైన చెప్పిన కార్యక్రమాలపై దృష్టి సారించండి. జూలై నెలాఖరు వరకు ఒకటో తరగతి పిల్లలతో 'వానచినుకులు' లోనిమొదటి పది పుస్తకాలని చదివించండి. రెండో తరగతి పిల్లలతో ' వానచినుకులు' లోని మొదటి ఇరవై పుస్తకాలని చదివించండి. మూడు, నాలుగు, ఐదో తరగతి లోని చదవడం రాని పిల్లలతో ' కథా వాచకాలు' చదివించండి. తద్వారాజూలై లోగా అందరు పిల్లలకు చదవడం రాయడం వచ్చేలా చేయండి.
ఈ కార్యక్రమాలపై మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మరిచిపోకండి.
ఉంటా మరి......
మీ
ఆర్. సూర్య ప్రకాశ్ రావు,
అకాడమిక్ మానిటరింగ్ అధికారి,
రాజీవ్ విద్యా మిషన్,
మెదక్ జిల్లా
No comments:
Post a Comment