నూతన ప్రాజెక్ట్ అధికారిగా మస్తానయ్య గారు
రాజీవ్ విద్యా మిషన్ మెదక్ జిల్లా ప్రాజెక్ట్ అధికారిగా వి. ఎన్. మస్తానయ్య గారు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాజీవ్ విద్యా మిషన్ హైదరాబాద్ జిల్లా ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. గతంలో మెదక్ జిల్లా విద్యాధికారిగానూ ఆయన పనిచేసి ఉండడంతో జిల్లా విద్యా రంగ పరిస్థితిపై, రాజీవ్ విద్యా మిషన్ కార్యకలాపాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. జిల్లా ప్రాజెక్ట్ అధికారిగా ఆయన రాకతో విద్యారంగ నాణ్యతపై ఆయన దృష్టి పెడతారని విద్యారంగ అభిమానులు భావిస్తున్నారు. గతంలో జిల్లా విద్యాధికారిగా ఆయన తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుతం పదోతరగతి లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.